అధిక రక్తపోటు ఉన్న వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మధుమేహం, చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం కూడా గుండెపోటుకు కారణమవుతాయని చెబుతున్నారు. మద్యం, పొగ తాగే వారికి గుండె పనితీరు మందగిస్తుందని ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, వంశపారంపర్యంగా కూడా గుండె జబ్బులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఛాతీలో నొప్పి అనిపిస్తే ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు.