గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 16వ డివిజన్ 74వ సచివాలయ పరిధిలోని సత్యనారాయణ నగర్ ప్రాంతాలలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధికా,బహదూర్ గార్లతో కలిసి వైసీపీ స్థానిక ఇంచార్జి దేవినేని అవినాష్ ఇంటిఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు గురించి వివరించి, ప్రజల సమస్యలును తెలుసుకుని సంబంధిత సచివాలయం సిబ్బంది మరియు మున్సిపల్ అధికారులు ద్వారా వివరాలు తెలుసుకుని సాధ్యమైనంత త్వరలో పరిష్కరించి వారికి అందేలా చర్యలు చేపట్టాలని కోరడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ప్రజలకి అండగా ఉండేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలకి ఎల్లప్పుడూ అయన అండగా ఉంటాను అని భరోసా కలగచేసారు.