తిరుపతి జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుందని పేర్కొన్నారు. పోలీస్ శాఖ తరఫున బాధితులెవరైనా ఉంటే నేరుగా తనను కలిసి సమస్యలను వివరించాలని కోరారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని ఎస్పీ కోరారు.