విధి నిర్వహణలో మరింత మెలకువలు తెలుసుకునేందుకు పోలీస్ సిబ్బందికి మూడు రోజుల రిప్రెష్మెంట్ కోర్స్ ప్రారంభించిన కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పి. ప్రతి ఒక్క చట్టంపై పూర్తి అవగాహన ఉన్నప్పుడే బాధితులకు న్యాయం అందించగలం అని కృష్ణా జిల్లా, అడిషనల్ ఎస్పీ తెలియజేసారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు సత్వర న్యాయమందించే ప్రతి ఒక్క పోలీస్ అధికారి అన్ని విషయాల్లో నిష్ణాతుడు కావాలని, ప్రతి ఒక్క చట్టంపై పూర్తిస్థాయి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించగలమని ఈరోజు జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో 12 వ బ్యాచ్ కు మూడు రోజుల రిప్రెష్మెంట్ కోర్స్ ను ప్రారంభిస్తూ అడిషనల్ ఎస్పి (అడ్మిన్) శ్రీ ఎన్ వెంకట రామాంజనేయులు గారు అన్నారు.