శ్రీలంకలో ఇంధన కొరత నేపథ్యంలో సైకిళ్లకు డిమాండ్ పెరిగిపోయింది. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండటంతో లంక ప్రజలు వాహనాలకు బదులు సైకిళ్లను కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో వీటికి ఫుల్ డిమాండ్ పెరిగింది. ఉద్యోగులు సైతం ఆఫీసులకు వీటిపైనే వెళ్తున్నారు. ప్రస్తుతం శ్రీలంకలో చాలా మందికి సైకిళ్లు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌గా మారాయని చెబుతున్నారు.