బంగాళాదుంపల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. చర్మ ఆరోగ్యానికి ఇవి చాలా మేలు చేస్తాయి. కళ్ళ చుట్టూ ఉన్న వలయాలను బంగాళాదుంపలతో తొలగించొచ్చు. బలహీనంగా ఉన్నవారు, బరువు పెరగాలని కోరుకునే వారు బంగాళాదుంపలు తినడం ఉత్తమం. చర్మంపై ఉండే ముడతలను, నల్ల మచ్చలను ఇవి తొలగిస్తాయి. జీర్ణక్రియను సులభతరం చేయడానికి, మలబద్ధక సమస్యలకు ఇది చక్కగా పనిచేస్తుంది.