తెనాలి: తెనాలి పట్టణ 27వ వార్డు మాదలవారి వీధి సచివాలయం మహిళా వాలంటీర్లకు అర్ధరాత్రి సమయంలో వీడియో కాల్స్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్న వీఆర్వో యారం నాగరాజు పై చర్యలు తీసుకోవాలని మంగళవారం మహిళా వాలంటీర్లు తాసిల్దార్ రవిబాబుకు విన్నవించారు. తరచూ అసభ్య పదజాలంతో తో మాట్లాడుతుంటే గతంలో మహిళా కానిస్టేబుల్ కు కూడా విషయం చెప్పామని అన్నారు. అయినా మార్పు రాలేదన్నారు. వీఆర్వో పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.