యూపీలోని బులంద్‌షహర్ జిల్లాలో దారుణం జరిగింది. ఖుర్జా నగర్ కొత్వాలి ప్రాంతంలోని ఓ గ్రామంలో ఆరేళ్ల బాలికపై పక్కింటి వ్యక్తి రవి అత్యాచారం చేశాడు. టీవీ చూపిస్తానని తన ఇంటికి తీసుకెళ్లి సోమవారం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక ఆర్తనాదాలతో ఆమె తల్లి పరుగున వెళ్లింది. దీంతో విషయం బయటపడింది. నిందితుడికి స్థానికులు దేహశుద్ది చేశారు. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు పెట్టారు.