శ్రీలంక పర్యటనలో రాణించిన భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ర్యాంకుల్ని మెరుగుపర్చుకున్నారు. ఐసీసీ మంగళవారం విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్టార్ ఓపెనర్ మంధాన 9వ స్థానానికి ఎగబాకగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 13వ ర్యాంకులో నిలిచింది. వన్డే బౌలింగ్ విభాగంలో రాజేశ్వరి గైక్వాడ్ 3 స్థానాలు మెరుగుపర్చుకొని 9వ ర్యాంకులో కొనసాగుతోంది.