ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో ఫ్యామిలీ డాకర్ట్ కాన్సెప్ట్ అమలులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేయనున్నట్టు తెలిపారు. ఇక ఆరోగ్య శ్రీలోకి మరిన్ని వైద్య సేవలు చేర్చనున్నారు. అదనంగా కొత్త ప్రొసీజర్లు చేర్చాలని సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.