బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం లభించింది. బ్రిటిష్ పార్లమెంట్ గంగూలీని ఘనంగా సత్కరించింది. ఈ విషయాన్ని గంగూలీ స్వయంగా వెల్లడించాడు. బ్రిటిష్ పార్లమెంటు తనను ఒక బెంగాలీగా సత్కరించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. బ్రిటిష్ పార్లమెంట్ ప్రతి ఏడాది ఒకరిని ఇలా గౌరవిస్తుందని, ఈసారి తనకు ఆ అవకాశం లభించిందని చెప్పాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa