ఆరోగ్యకరమైన చిన్నారుల్లో హెపటైటిస్ వ్యాధి సోకుతున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలను సునిశితంగా పరిశీలిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. తీవ్రమైన రీతిలో హెపటైటిస్ వ్యాధి సోకినవారిలో చాలా కేసుల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతోంది. సుమారు 35 దేశాల్లో దాదాపు వెయ్యికిపైగా హైపటైటిస్ కేసులు నమోదు అయినట్లు తెలిపింది. ఇప్పటి వరకు హెపటైటిస్ వల్ల 22 మరణాలు సంభవించాయి.