దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదవటంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఈ వ్యాధి పట్ల అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జాగ్రత్తగా గురువారం సూచించింది. ఈ వ్యాధి లక్షణాలు, గుర్తింపు, చికిత్సపై గత నెలలో మార్గదర్శకాలు విడుదల చేశామని గుర్తు చేసింది.
రాష్ట్రంలోకి కొత్తగా ప్రవేశించే వారిపై నిఘా పెట్టాలని, అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందించాలని కోరింది.