రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలు చేసిన అరాచకాలు ఇంకా ఐరోపాను వెంటాడుతున్నాయి. తాజాగా ఉత్తర పోలాండ్ లోని సౌల్డా ప్రాంతంలో 17.5 టన్నుల అస్థికలను అధికారులు గుర్తించారు. ఇవి 8వేల మంది అస్థికలని నిర్దారించారు. వీరందరి శరీరాలను ఒక గోతిలోవేసి దహనం చేసినట్లు పోలాండ్‌కు చెందిన నేషనల్ రిమంబరెన్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సైంటిస్ట్ తెలిపారు. ఇక్కడ కనీసం 30వేల మందిని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.