గుంటూరు: మున్సిపల్ కార్పోరేషన్ కార్మికులు పలు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలంటూ నాలుగు రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. కార్మికులు సమ్మెలో ఉండడంతో నగరంలోని వీధిలైట్లు మూడురోజుల నుంచి పగలు, రాత్రి తేడాలేకుండా నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నాయి. ఈ విధంగా లైట్లు వెలగడం వలన కార్పొరేషన్ కు లక్షల రూపాయలలో నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్నామ్యాయ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.