ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో ఇప్పటివరకూ చరిత్రలో భారత్ ఒక్క పతకమే (2003లో లాంగ్‌జంప్‌లో అంజూబాబీ కాంస్యం) సాధించింది. ఒలింపిక్స్‌లో పసిడితో సరికొత్త చరిత్ర సృష్టించిన నీరజ్‌పైనే అందరి కళ్లు. ఈ సీజన్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన మెరుగుపర్చుకుని జాతీయ రికార్డు బద్దలు కొట్టిన నీరజ్ చరిత్ర తిరగరాయాలనే పట్టుదలతో ఉన్నాడు. జావెలిన్ త్రో అర్హత రౌండ్లు గురువారం, ఫైనల్ శనివారం జరుగుతాయి.