టీమిండియా స్పిన్నర్ చాహల్ గురువారం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 47 రన్స్ ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ మైదానంలో ఒక మ్యాచ్ లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. 39 ఏళ్ల క్రితం ఇదే గ్రౌండ్ లో జరిగిన 1983 వరల్డ్ కప్ ఫైనల్ లో మొహిందర్ అమర్నాథ్ 12 రన్స్ ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఈ రికార్డును చాహల్ బద్దలుకొట్టాడు.