దేశంలో పెండ్లికాని యువత పెరిగిపోతున్నట్టు జాతీయ గణాంకాల కార్యాలయం నివేదిక వెల్లడించింది. పెండ్లి కానివారు 2011లో 17.2% మంది ఉండగా, 2019 నాటికి 23 శాతానికి పెరిగింది. 2011 నాటికి పెండ్లికాని పురుషుల సంఖ్య 20.8% ఉండగా, 2019 నాటికి 26.1 శాతానికి పెరిగింది. యువతుల సంఖ్య కూడా 2011లో 13.5% నుంచి 2019 నాటికి 19.9% చేరింది. జమ్ముకశ్మీర్, యూపీ, ఢిల్లీ, పంజాబ్‌ల్లో పెండ్లికాని యువత సంఖ్య ఎక్కువగా ఉంది.