ఉత్తరాదిలో ఏటా జరిగే కన్వర్ యాత్ర గురువారం ప్రారంభమైంది. కన్వర్ యాత్రికులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, గోముఖ్, గంగోత్రి తదితర ప్రాంతాలను దర్శించి, అక్కడి పవిత్ర గంగాజలాలను సేకరిస్తారు. ఈ క్రమంలో యాత్రికులకు తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని కేంద్ర హోంశాఖ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. యాత్రికులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa