ఏపీ సీఎం జగన్ నాలుగో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర ఆర్థికసాయాన్ని శుక్రవారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో ఒక్కో లబ్ధిదారుని ఖాతాల్లో రూ.10వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్లను సీఎం జగన్ జమ చేశారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం రూ.1,026 కోట్లను పంపిణీ చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం ఉన్న డ్రైవర్లకు ఆర్థిక సాయం అందజేస్తున్నామని సీఎం జగన్ అన్నారు.