శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. గురువారం సింగపూర్ నుంచి ఈమెయిల్ ద్వారా తన రాజీనామా లేఖను పార్లమెంట్ స్పీకర్ మహింద అభయ్వర్ధన్కు పంపించారు. గొటబాయ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. అలాగే, శనివారం పార్లమెంటు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి, వారం రోజుల్లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని తెలిపారు.