ఏపీ మంత్రి రోజాకు సొంత పార్టీ నేత నుంచే చేదు అనుభవం ఎదురైంది. చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం బుట్టిరెడ్డి కండ్రిగలో మంత్రి రోజా ముందే గ్రామ మాజీ సర్పంచ్, గ్రామ స్థాయి వైసీపీ నేత తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణ పనులను సొంత ఖర్చులతో చేస్తే తమకు ఇప్పటిదాకా బిల్లులే మంజూరు కాలేదని, వైసీపీని నమ్ముకుని తాము అప్పుల్లో కూరుకుపోయామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.