ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గోడౌన్ వద్ద శుక్రవారం గోడ కూలిపోయింది. అది మీద పడడంతో ఐదుగురు మరణించారని పోలీసులు తెలిపారు. మరో 9 మంది గాయపడడంతో వారిని రాజా హరీష్ చంద్ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సహాయక చర్యల కోసం ఢిల్లీ అగ్నిమాపక దళం, పోలీసులు ప్రస్తుతం ఘటనాస్థలికి చేరుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa