గోదావరి వరదలపై అధికారులతో సీఎం జగన్ శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఏరియల్ సర్వే అనంతరం వీడియో కాన్ఫరెన్స్లో ఐఏఎస్, ఐపీఎస్లకు ప్రత్యేక సూచనలు ఇచ్చారు.
ప్రతి వరద బాధిత కుటుంబానికీ రూ.2 వేల సాయం అందించాలని సూచించారు. అంతేకాకుండా 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, కిలో బంగాళాదుంపలు, పామాయిల్, కిలో ఉల్లిపాయలు, పాలు అందించాలన్నారు. వచ్చే 48 గంటల్లో వీటిని బాధితులకు ఇవ్వాలన్నారు.