సాధారణ రక్తపోటు (బీపీ) 120/80గా ఉంటుంది. అయితే బీపీలో ఏ మాత్రం హెచ్చుతగ్గులున్నా అవి ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. హై బీపీ కారణంగా గుండె జబ్బులు తలెత్తుతాయి. ఇక 'లో బీపీ' కారణంగా శరీర భాగాలకు రక్త ప్రసరణ సరిగ్గా లభించదు. రెండింటి వల్ల ముప్పు ఉంటుంది. నిద్ర లేచే సమయంలో మైకం, తరచూ అలసట, వికారం, ఏకాగ్రత కోల్పోవడం వంటివి బీపీ లక్షణాలుగా భావించాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి.