ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లంక గ్రామాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 16, 2022, 12:07 PM

అల్లూరి, కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు సహా పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరద పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సీఎం సమగ్రంగా సమీక్షించారు. సహాయక చర్యలపై ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. వచ్చే 24 గంటలు హై అలర్ట్‌గా ఉండాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు కూడా గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉందన్నారు. లంక గ్రామాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని సూచించారు. వరద ప్రభావం ఉన్న గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించాలని, గోదావరి గట్లకు ఆనుకొని ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. గట్లు బలహీనంగా ఉన్న చోట గండ్లు పడకుండా చూడాలన్నారు. అవసరమైతే ఇసుక బస్తాలు తదితర సామగ్రి సిద్ధం చేయాలని, గండ్లకు ఆస్కారం ఉన్న చోట వీలైనన్ని ఇసుక బస్తాలు ఉండాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com