చిన్నగంజాం మండలంలోని రొయ్యల చెరువుల వద్ద మోటార్లు అపహరించే ఇద్దరు దొంగలను ఎస్ఐ నాగబాబు శనివారం అరెస్టుచేసి వారివద్ద నుండి 8మోటార్లను స్వాధీనపర్చుకున్నారు.
4 రోజుల క్రితం బచ్చులవారి పాలెం వద్ద మూడు మోటార్లు చోరీకి గురికాగా ఆ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు గట్టి నిఘా పెట్టడంతో పి. వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్ అనే ఇద్దరు యువకులు దొరికారని, వారిని విచారించగా నేరం అంగీకరించారని ఎస్సై చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa