రాయచోటి పట్టణంలో నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి పసుపులేటి కోటేశ్వర రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూడు నాలుగు ఐదు తరగతులు విలినం చేస్తూ తీసుకువచ్చిన జిఓ 117 ను రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు నాలుగు ఐదు తరగతులను విలీనం చేయాలని ప్రయత్నం చేయడం సరికాదని నాడు నేడు పథకం ద్వారా పాఠశాలలోని విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేసి నూతన తరగతులు గదులను కూడా నిర్మించి నేడు జీవో నెంబర్ 117 పేరుతో విద్యార్థులకు పాఠశాలల దూరం చేసే ఆలోచన సరికాదని, ఇక్కడున్నటువంటి పాఠశాలను తరలించడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితులు కూడా ఏర్పడతాయని అభిప్రాయపడ్డారు.
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు తుమ్మల లవకుమార్ మాట్లడుతూ నాడు నేడు పేరుతో ఇంత అభివృద్ధి చేసినటువంటి పాఠశాలలను మూసివేయాలనే ఆలోచనలను ప్రభుత్వ అధికారులు పునరాలోచన చేయాలని, విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు మేధావి వర్గాలతో చర్చించి పాఠశాలను యధావిధిగా కొనసాగించాలని, గ్రామీణంలో చదివే పేద విద్యార్థుల భవిష్యత్ తో అడుకోవద్దు అని వారు ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు కిరణ్, దేవ, నరేష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.