కడప నగరంలోని పులివెందుల రోడ్డులో గల ఆశ నిలయం మూగ చెవిటి పిల్లల పాఠశాలలో వికసిత పౌండేషన్ అధ్యక్షురాలు శూలం లక్ష్మీదేవి ఆధ్వర్యంలో కె. వి. పల్లి మండలం దిన్నెమీదపల్లె గ్రామానికి చెందిన వెంకటేష్, భాను ల కుమారుడు మురిపీటి శాన్విక్ మొదటి పుట్టినరోజు పురస్కరించుకొని కేకు భోజన వితరణ ను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన లోకాసమస్త అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ మండలి కడప పట్టణ మహిళా విభాగ చైర్ పర్సన్ ఎ. లక్ష్మిభవాని మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని, బ్రతుకుతెరువు కోసం కువైట్ కి వెళ్లి ఎన్నో కష్టాల కడలిలో డబ్బు సంపాదించుకుని, తమ సంపాదనలో కొంత పేదలకు, వృద్ధులకు, అనాధలకు ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో తమ కుమారుడు మొదటి పుట్టినరోజు వేడుక కుటుంబ సభ్యుల మధ్యలో కాకుండా మూగ, చెవిటి పిల్లలు ఆశ్రమ పాఠశాలలో నిర్వహించడం చాలా గొప్ప విషయం అని కొనియాడారు. గత కొన్ని సంవత్సరాలుగా వికసిత ఫౌండేషన్ అధ్యక్షురాలు శూలం లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి వారి సేవానిరతి చాటాలని కోరారు.
ఈ కార్యక్రమంలో శాన్విక్ కుటుంబసభ్యులు రమేష్, లక్ష్మీదేవి, శివశంకర్, రాణి బాలకృష్ణ, సరస్వతి, లోకాసమస్త అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ మండలి కడప పట్టణ మహిళా విభాగ సెక్రెటరీ ఆర్. సుమలత, ఎగ్జిక్యూటివ్ మెంబర్ స్వర్ణగౌరీ, అర్చనాదేవి, సిస్టర్ లిస్సమ్మ జోర్జ్ తదితరులు పాల్గొన్నారు.