లారీ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడ మండలంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. శృంగవరపుకోట పట్టణం స్థానిక చింతావీధికి చెందిన సతీష్ అనే వ్యక్తి విశాఖపట్నం నుండి ఎస్ కోట వెళ్తున్న నేపథ్యంలో వెనక నుండి ఓ లారీ వచ్చి బలంగా ఢీకొట్టింది.
ఈ నేపథ్యంలో సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న లక్కవరపుకోట పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించి ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సతీష్ భౌతిక దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శృంగవరపుకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి లారీ డ్రైవర్ పోలీసులు అదుపులోనే ఉన్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.