ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ బాలికకు మంకీపాక్స్ కాదు...వైద్యుల స్పష్టీకరణ

national |  Suryaa Desk  | Published : Sun, Jul 17, 2022, 11:05 PM

ఇటీవల విజయవాడకు వచ్చిన చిన్నారికి సోకింది మంకీ ఫాక్స్ కాదని వైద్యులు తేల్చిచెప్పారు. ఇటీవల దుబాయ్ నుంచి విజయవాడ వచ్చిన రెండేళ్ల చిన్నారికి మంకీపాక్స్ ను పోలిన లక్షణాలు కనిపించడంతో కలకలం రేగింది. బాలికకు మంకీపాక్స్ అయ్యుంటుందన్న అనుమానంతో నమూనాలు సేకరించి, వాటిని పుణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపారు. అయితే ఆ చిన్నారికి మంకీపాక్స్ నెగెటివ్ గా వచ్చింది. ఆ బాలికకు మంకీపాక్స్ కాదని వైద్యులు నిర్ధారించారు.  ఆ బాలికకు చర్మంపై మామూలు దద్దుర్లు వచ్చినట్టు వైద్యులు గుర్తించారు. బాలిక కుటుంబం ఇతరులతో కాంటాక్ట్ కాలేదని ఆరోగ్యశాఖ కమిషనర్ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com