15వ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఓటు వేశారు. వెలగపూడిలోని సెక్రటేరియట్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు వైయస్ఆర్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. ఈ ఎన్నికల్లో 4,809 మంది ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమవారం తమ ఓటు వేయనున్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో, రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 21న పార్లమెంట్‌హౌస్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నూతన రాష్ట్రపతి 25న ప్రమాణస్వీకారం చేస్తారు.