ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌పై కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై ముఖ్యమంత్రులతో సమీక్ష జరిపింది. కాగా, ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంఫ్ ఆఫీసు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఏపీలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావస్తున్న సందర్బంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా పౌరుల్లో దేశభక్తి భావనను పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1.62 కోట్ల జాతీయ పతాకాల ఆవిష్కరించనున్నట్టు పేర్కొన్నారు. దేశభక్తిని, జాతీయభావాన్ని పెంపొందించేలా పలు కార్యక్రమాలు జరపనున్నట్టు వెల్లడించారు.