ఉపాధిలో మహిళల ప్రాతినిధ్యం బాగా తగ్గిపోయిన విషయాన్ని కేంద్రం గమనించాలి అని కేంద్రానికి వైసీపీ ఎంపీ లు తెలియజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఏపీ ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టాలి. మహిళల హక్కులు కాపాడాలి. మహిళల విద్య, జీవన ప్రమాణాల పెంపు, శిశు సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. పార్లమెంటులో వినియోగించకూడని పదాల (అన్ పార్లమెంటరీ) జాబితాను లోక్‌సభ కార్యాలయం అన్ని రాష్ట్రాలకు పంపింది. 1954 నుండి ఇది ఆనవాయితీగా వస్తోంది. పార్లమెంట్ ప్రాంగణంలో నిరసనలు, ధర్నాలపై ఆంక్షలు విధిస్తూ ఇచ్చిన ఆదేశాలు ఆనవాయితీగా ఇచ్చినవే.