మధ్యప్రదేశ్‌లో AAP బీజేపీకి షాకిచ్చింది. సింగ్రౌలి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిని ఓడించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం ద్వారా బోణీ కొట్టింది. సింగ్రౌలీ మేయర్‌గా రాణి అగర్వాల్ బీజేపీ అభ్యర్ధి చంద్రప్రతాప్ విశ్వకర్మను 9 వేల 300 ఓట్ల తేడాతో చిత్తు చేశారు.
రాణి అగర్వాల్ 2014లో తొలిసారి జిల్లా పంచాయితీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన ఆమె పరాజయం పాలయ్యారు. రాణి అగర్వాల్‌తో పాటు స్థానిక సంస్థల్లో గెలుపొందిన ఆప్ నేతలకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు కీలకమైన సింగ్రౌలీ మేయర్ పీఠాన్ని ఆప్ గెలుచుకోవడంతో బీజేపీ నేతలు షాక్‌కు గురయ్యారు. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత పెద్ద మున్సిపాలిటీ సింగ్రౌలీయే కావడంతో పరాజయాన్ని కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారు.