వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బలంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం అని జనసేన నాయకులూ పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేన పుట్టినప్పటి నుంచి జన క్షేత్రంలోనే తిరుగుతున్నాం . గత ఎన్నికల్లో అన్నను నమ్మారు... అదో భ్రమ అని తేలింది. రోడ్ల మీద తిరిగిన వ్యక్తి ఎంతో మంచి చేస్తాడని అనుకున్నారు. రాగానే 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల జీవితాలను రోడ్డున పడేశాడు. సహజ సంపదలను దోచుకునే మార్గాలను ఎంచుకున్నాడు. ఒక్కసారి రాష్ట్రంలోని ప్రజలంతా ఆలోచించాలి. అన్న వస్తే అద్భుతాలు జరుగుతాయని భావించిన వారు సైతం కళ్ళు తెరవాల్సిన సమయం వచ్చింది. కచ్చితంగా మేము ప్రజా పోరాటాలు చేస్తాం. ప్రజలకు అద్భుత పరిపాలన అందించగల పటిష్టమైన ప్రణాళిక జనసేన వద్ద ఉంది" అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.