అమెరికాలోని లఫయెట్టె ప్రాంతానికి చెందిన నికోలస్ బోస్టిక్ (25) ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాడు. గత వారం లఫయెట్టెలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్న నికోలస్ అగ్ని ప్రమాదాన్ని గమనించాడు. వెంటనే ఆ ఇంట్లోకి వెళ్లి ప్రాణాలకు తెగించి, ఐదుగురు పిల్లలను కాపాడాడు. అతడి సాహసాన్ని పోలీసులు ప్రశంసిస్తూ, స్వయంగా ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa