విద్య శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు , డీఈఓ ఇచ్చిన వివరణ ప్రకారం తల్లితండ్రుల విన్నపాల , ఉద్యమాలు, నిరసనలు, మేరకు సీతమ్మధార వసంత బాల ఎయిడెడ్ పాఠశాల, జ్ఞానాపురం సెయింట్ పీటర్స్ మరియు జగదాంబ సెయింట్ ఆంథోనీ పాఠశాలలు మూయవెయ్యరాదని విద్యార్థి సంఘ నాయకుడు, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత కుమార్, రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ఉమ్మడి మహేష్ , అక్క బత్తుల గిరీష్ తల్లితండ్రుల అసోసియేషన్ అధ్యక్షుడు బోని దుర్గారావు స్పష్టం చేశారు.
విద్యార్థులను ఉచిత విద్యకు దూరం చేస్తే మంత్రి బొత్స సత్యనారాయణ , ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పాఠశాలలను పునర్ ప్రారంభించి , ఉచిత విద్య, ఉచిత భోజనం , ఉచిత పుస్తకాలు, ఉచిత బట్టలు, ప్రభుత్వ అందించే అన్ని సౌకర్యాలు విద్యార్థులకు అందేలా చూస్తామని విద్యార్థి సంఘ నాయకులు స్పష్టం చేశారు, యాజమాన్యాలు సహకరించకపోతే బాధ్యత వహించవలసి వస్తుందని తెలియజేశారు, విద్య , వ్యాపారం చేయొద్దని తెలియజేశారు, యాజమాన్యాలు ఉపాధ్యాయులు లేక నడపలేని స్థితిలో ఉంటే, ప్రభుత్వ సిబ్బంది కోరుతూ లేఖలు ఇమ్మని కోరారు.
ప్రభుత్వం బోధన బోధన ఇతర సిబ్బందితోపాటు విద్యార్థులకి ఉచితంగా ఇవ్వాల్సిన అన్ని సౌకర్యాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు. ఈ విషయాన్ని త్రుంగన తొక్కితే ప్రభుత్వం తగు చర్యలు యాజమాన్యాలపై తీసుకుంటుందని విద్యార్థి నాయకులు సమయం హేమంత్ కుమార్ మరియు ఉమ్మడి మహేష్ తెలియజేశారు, పోర్ట్ పాఠశాల వివాదం కూడా యుద్ధ ప్రాతిపదిగిన తేల్చి, కొనసాగించాలని వీరు కోరారు, కలెక్టర్ కి స్పందనలో వీటిపై ఫిర్యాదు చేశారు.