--- రోజూ రాత్రి నిద్రపోయేముందు నాలుగైదు పిస్తా పప్పులను తింటే, మంచి నిద్ర పడుతుంది.
--- పాలలో కొద్దిగా శొంఠి పొడి, పటికబెల్లం కలిపి తాగితే, తీవ్రమైన తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు.
--- నిమ్మరసం, తేనెను సమపాళ్లలో తీసుకుని, అందులో చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకుంటే, సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబుకు చెక్ పెట్టవచ్చు.
--- ధనియాల పొడిని కానీ, డైరెక్ట్ గా ధనియాలను కానీ ఒక రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టి, తెల్లారిన వెంటనే ఆ నీటిని తాగితే హైబీపీ ని అదుపులో ఉంచుకోవచ్చు.
--- పాలలో పంచదార కాకుండా తేనే కలుపుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చెయ్యడం వల్ల ఎముకలు బలంగా, ఆరోగ్యంగా తయారవుతాయి.