డాలరుతో రూపాయి మారకం విలువ రోజురోజుకు క్షీణిస్తోంది. గత 8 ఏళ్లలో రూపాయి విలువ 25% మేర క్షీణించింది. 2014 డిసెంబర్ 31 నాటికి రూపాయి విలువ 63.33గా ఉంది. 2022 జులై 11 నాటికి 79.41కి చేరింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్ లో వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, క్రూడాయిల్ ధరలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులే రూపాయి పతనానికి కారణమని ఆమె చెప్పారు.