1947లో భారత్-పాక్ దేశ విభజన సమయంలో రీనా చిబర్ అనే మహిళ పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చింది. అప్పుడు ఆమెకు 15 ఏళ్లు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటోంది. అయితే, పాకిస్తాన్‌లోని తన పూర్వీకులను కలవాలని అక్కడి వెళ్లేందుకు 1965లో వీసా కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ ప్రతిపాదనను ఆ దేశం తిరస్కరించింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఆమెకు ఇటీవల పాకిస్తాన్ వీసా మంజూరు చేయటంతో దాదాపు 75 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ వెళ్లింది.