ఉపరాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వా మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. లోక్ సభ సెక్రెటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్కు మార్గరెట్ అల్వా నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. ఆమె అభ్యర్థిత్వానికి 17 పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలపగా.. మొత్తం 19 పార్టీలు మద్దతు తెలిపాయి. ఉప రాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న జరగనుంది.