తనతో పెళ్లికి నో చెప్పిందన్న కోపంతో ఓ యువకుడు తన మాజీ ప్రియురాలి వీడియోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీకి చెందిన ఓ మహిళను యువకుడు గతంలో పెళ్లి చేసుకోవాలని కోరగా ఆమె తిరస్కరించి వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. దీంతో నిందితుడు ఆమె ఫొటోలతో మార్ఫింగ్ చేసిన అశ్లీల వీడియోలను ఆమె భర్త, తన కుటుంబ సభ్యులకు పంపించాడు. ఈ మేరకు వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.