శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. నాలుగు రోజుల్లోనే ప్రాజెక్టుకు 100 టీఎంసీల నీరు చేరింది. మరి కొన్ని రోజుల పాటు ఇదే ప్రవాహం కొనసాగనుంది. ప్రస్తుతం 3 లక్షల 24 వేల క్యూసెక్కుల నీరు వస్తుంది. నీటి ప్రవాహం పెరిగితే 21వ తేదీన డ్యాం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. డ్యాం వద్ద ఇప్పటికే అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. గేట్లు ఎత్తినా ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.