కనీస మద్దతు ధరపై ఇప్పటికైనా కమిటీ నియామకం సంతోషమే..కానీ ఈ పని ఎప్పుడో చేసుండాలి లేక స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేసుండాలి అని టీడీపీ నాయకులూ సోమిరెడ్డి చంద్రశేఖర రెడ్డి తెలిపారు. రైతులకి మద్దత్తు ధర కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసినా నేపథ్యంలో , దాని మీద స్పందిస్తూ... ఎకరా వరిసాగుకు పెట్టుబడి రూ.12 వేలకు పైగా అదనమైపోయింది. ఎంఎస్పీ మాత్రం తూతూమంత్రంగా క్వింటాలుకు రూ.100 పెంచి సరిపెట్టుకున్నారు. ఆలస్యంగా నైనా కమిటీ వేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదములు. కానీ కాలయాపన జరగకుండా ఒక నిర్ణీత సమయంలో నిర్ణయాలు అమలుచేసి దేశంలోని రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.