దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న ఖాళీ పోస్టులపై కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భాగవత్ కరాడ్ సోమవారం కీలక ప్రకటన చేశారు. 11 బ్యాంకుల్లో 38,117 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో 12,713 ఆఫీసర్ పోస్టులు, 14,226 క్లర్క్ పోస్టులు, 11,238 కింది స్థాయి సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అత్యధికంగా స్టేట్ బ్యాంకులో 6,425 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.