గత కొన్ని రోజులుగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ పై జరుగుతున్న చర్చ తెలిసిందే. కొందరు కోహ్లీకి మద్దతుగా నిలవగా, మరికొందరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ఆటగాడు దినేశ్ కార్తీక్ కోహ్లీకి బాసటగా నిలిచాడు. సోమవారం టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డీకే మాట్లాడుతూ ఫామ్ లోకి రావడానికి ఎన్నో రోజులు పట్టదని, త్వరలోనే ఫుల్ గా రీచార్జ్ అయ్యి వస్తాడని తెలిపాడు.