టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యూనివర్సల్ నాయకుడని.. జగన్ గల్లీ నాయకుడంటూ టీడీపీ నాయకుడు కొండ్రు మురళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దేశ రాజకీయాల్లోనే అత్యంత ఎక్కువ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీకి 2024 ఎన్నికల్లో కనీసం 17 సీట్లు కూడా రావంటూ మాజీ మంత్రి, అన్నారు. వైఎస్సార్‌సీపీలో దోపిడీ నాయకులే ఉన్నారంటూ ఆరోపణలు చేశారు. విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వెనకాల ఉన్న నాయకులు గడ్డి తినడానికే పనికొస్తారంటూ పరుష పదజాలంతో కొండ్రు మురళి వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెబుతారన్నారు. మద్యం అమ్మకాల్లోనూ అవినీతి జరుగుతుందని.. సొంత బ్రాండ్లతో రోజుకి రూ.250 కోట్లు దోచుకుంటున్నారని మురళి ఆరోపించారు.
అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రి కళా వెంకట్రావు మాట్లాడుతూ.. వరదల బాధితుల సాయంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని విమర్శించారు. వరదల్లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే జగన్ తాడేపల్లిలో నీరో చక్రవర్తిలా కూర్చున్నారంటూ విమర్శించారు. వరద సామగ్రి కూడా సమకూర్చుకోవడంలో స్థితిలో ప్రభుత్వం ఉండటం చాలా సిగ్గు చేటన్నారు. ముంపు గ్రామాల్లో ఉన్న పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వచ్చే పరిస్థితి ఉందని.. ఆహార పొట్లాల కోసం తన్నుకుంటున్నారని.. ఈ ముఖ్యమంత్రి పదవి ఎందుకంటూ కళా వెంకట్రావు ఘాటుగా విమర్శించారు.