అనంతపురం నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని లాడ్జిలను సి.ఐ జాకీర్ హుస్సేన్, ఎస్సై జమాల్ బాషాల ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రతీ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. లాడ్జి పరిసరాలు స్పష్టంగా కన్పించేలా తప్పనిసరిగా సి. సి. కెమెరా ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. అనుమానాస్పదులు లాడ్జిల్లో బస చేసిన సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. లాడ్జిల్లో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావిచ్చినా గట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలు లాడ్జి లను పోలీస్ వారు సోదా చేసి అక్కడ నివసిస్తున్న వారి వివరాలు తెలుసుకొని , అనుమానం వ్యక్త పరిచిన వారి వివరాలు నమోదు చేసుకోవడం జరిగింది.