కర్ణాటకలో సంజయ్ నగర్‌కు చెందిన నాగరాజ్ కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసైన నాగరాజ్ వేధింపులు తాళలేక అతని భార్యా పిల్లలతో వెళ్ళిపోయి విడాకులకు సిద్ధమైంది. అయితే నాగరాజ్ అత్తింటికి వెళ్లి తన భార్యను పంపించాలని గొడవ చేశాడు. అతడితో వెళ్లేందుకు భార్య అంగీకరించలేదు. కోపంతో రగిలి భార్యను చంపాలనుకున్నాడు. అయితే మద్యం మత్తులో ఉండడంతో తన భార్యపై కాకుండా అత్త తలపై సుత్తితో కొట్టి చంపాడు.